9.10.11

పెద్దగా చదూకోని మా అమ్మ నాకు చదువు నేర్పడాని కోసం "ఇది" చదివేది

 అమ్మ ఎట్ల చూసినా, ఎవరికైనా తొలిగురువే.    
 నాకైతే ఓనమాలు నేర్పిందీ మా అమ్మనే. నా బడి చదువు మొదలైంది రెండో తరగతి నుంచే. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. ఆ కాలం చదువు. ఒకటోది.  మా అమ్మ నన్ను అరేయ్ రాజా! పలకా, బలపం తీసుకునిరారా! అన్నది తక్కువ. ఎప్పుడు ఒక పద్యం చదివేది. నేనా పద్యం వినుడు తోనే, నాగ సొరం ఊదితే, ఆడే పాము తీరు, చదూకోను సిద్దమయ్యేది. అప్పుడు అది ఏదో నోటి పద్యం అనే తెలుసు. కానీ పెద్దగైనాంకనే తెలిసింది కందమని. అది లోకంల ఉన్నదీ, చాలా మంది విన్నదే కావచ్చు. ఐనా చిన్న పిల్లడిని stimulate చేసి చదువు నేర్పాలెనని ఆమెకు అప్పుడే తెలుసుడు గొప్ప కాదా? ఇంత రామాయణం ఎందుకంటే? ఆపద్యం బ్లాగుల రాయాలెననే..!
                తేరా! పలకా బలపము
                ఈరా! అయ్యోరి చేతికింపుల రంగా!
                పోరా! భోజన వేళకు
                రారా! పద్యాలు చదువ రాజ కుమారా! 
   

4 comments:

రసజ్ఞ said...

బాగుందండీ ఈ పద్యం! జానపద పద్యంలాగా, చిన్నపిల్లలకి కూడా చక్కగా అర్ధమయ్యేలా!

రాకుమార said...

రసజ్ఞ గారు మీ స్పందనకు ధన్యవాదాలండి.

మిస్సన్న said...

రాకుమార గారూ! తెలుగు పద్యంపై మీకు మక్కువను,
ప్రావీణ్యతను చిన్న నాటనే మీ అమ్మగారు పాలబువ్వతో కలిపి పెట్టారు.మీ మాతృమూర్తికి వందనాలు.
మీకు అభినందనలు.

రాకుమార said...

మిస్సన్న గారు, మీ సహృదయ స్పందనకు నమస్సులు. మా అమ్మ తాను ఏ నోటనో విన్న పద్యమే, నాకు చదువు నేర్పడానికి, నాలో నేర్వాలన్న ఇష్టాన్ని ఉద్దీపింప చేయడానికి ఈ పద్యం చదివేది. కవిత్వాంశ ఉండే వచన కవిత్వం, వచనం, పద్యం ఏదైనా ఇష్టమే. సాహిత్యం పీడిత జన పక్షంగా ఉండాలన్నది నా ప్రగాఢ ఆకాంక్ష.