11.10.11

మన కాలానికి దగ్గరి వాడైనా మనకు తెలియని వీరుని వర్ధంతి ఇవాళ

12 గ్రామాల మీద రాజ్యాధికారం కావాలని నిజాం సర్కారుతో పోరాడిన వీరుడు 
 -"కొమురం భీము"
ఆయన ఇంటి పేరు తగిలించుకుని వ్యాపారాత్మక సినిమాలు తీసి, కోట్లు గడించాలన్న యావ, మిథ్యా సానుభూతి విభూతి తప్ప ఈనాటి కుర్ర హీరోలకు, వాళ్ల వెనక నీడలైన దురభిమానులకు, ఆ యోధుని గుండె దిటవు, తెగువల గురించి ఏం తెలుస్తుంది.

   వాళ్లకనే కాదు, అతిదగ్గరి చారిత్రక పురుషుడైన అతని గురించి మనకూ తెలిసింది తక్కువే. 1940 లో మరణించిన ఒక ధీరుడాయన. అయినా ఆయన చరిత్ర ఏదో ఇతిహాసంలా తప్ప.., స్పష్టంగా అందింది తక్కువ. హేమన్ డార్ఫు నివేదికలు, ప్రభుత్వ రికార్డులూ, కొమురం భీంను దేవునిగా భావించే ఆయన వంశీకుల పుక్కిటి పురాణ కథలు తప్ప నిర్దిష్టంగా మనకు తెలిసింది చాలా తక్కువ.
   అయినా సాహు, అల్లం రాజయ్యలు విషయ సేకరణకై ఎంతో శ్రమకోర్చి, ఊళ్లూ,అడవులూ తిరిగి, కొమురం భీం జీవితాన్ని నవలగా 1983 లో అందించారు. ఆ పుస్తకం 1993 లో మళ్లీ పునర్ముద్రితమైంది.
    ఒక వీరుని పోరాట ఘట్టంలో, అతని అడుగు జాడలకు అనువుగా మారిన "జోడెన్ ఘాట్".....
   ఆ ధీరుని చరితను గోండుల ఆత్మాభిమాన ఝరీ ప్రవాహంగా గానం చేస్తున్న "బాబేఝరి" కొండ వాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గమార్పు లేకుండా అట్లే ఉన్నాయి, నిజాం స్వామ్యమైనా, ప్రజాస్వామ్యమైనా తమ బతుకుల కోసం తామే పోరాడంది, మారమనే సందేశంగా కొమురం భీం అడుగు జాడగా..............  
(కొమురం భీం 71 వ వర్ధంతి సందర్భంగా)

4 comments:

, said...

u would have write in detail MORE ABOUT KOMURAM BHEEM.
Anyway thanks.

Anonymous said...

great

రాకుమార said...

thank you sridhar garu & annymousjI. sridharji! ok I will try to write in future.

కెక్యూబ్ వర్మ said...

మన్నెం వీరుడు కొమరంభీంనకు జోహార్లు...