27.9.13

అవాంఛితం




నాలోని నీలో..
నీలోని నాలో..
నాలోని నీలోని నాలో
నీలోని నాలోని నీలో
నాలోని నీలోని నాలోని నీలో....
నీలోని నాలోని నీలోని నాలో....

ఇలా ఎన్ననీ..? ఎంతనీ..?
అనంత అనుమానాల అపార నీరవ పారావారాల
చూపుల ఈదులాట.
అలసీ.. సొలసీ..
అర్ధ అబద్ధాల మిథ్యాబింబాల ఊబుల్లో ఊపిరాడక..
అసంపూర్ణ అరకొర కొఱ్ఱాయి మొట్టులై
మళ్లీ రాజుకునే పునరావృత నాటకం.

నా నోట్లో నీవు .. 
నీ నోట్లో నేను ..
నా నోట్లోని నీ నోట్లో నేను ...
నీ నోట్లోని నా నోట్లో నీవు ...

ఎన్నాళ్ల్ననీ ..?  ఎందాకనీ ..?
విస్తృత ప్రభావాల విపరీత వికృత విశుద్ధ శబ్దాల 
వీరావేశాల బొంగురు గొంతుల గోండ్రు కప్పల వాదులాట.
మోగీ .. మొరిగీ..
అర్ధ సమర్థనల కర్కశ, కర్ణకఠోర కాలుష్యాల కలేబాలో వేగలేక..
అసమంజస హుటాహుటి కుటిల హఠమై
మళ్లీ అడ్డుకునే పునః ప్రేరేపిత బూటకం.
                             ........ 23/09/2013    
     
                      



 



No comments: