9.9.13

ఇవాళటి పరిస్థితులను ఆనాడే ఊహించి కాళోజి రాసాడు చూసారా...



కాళోజీ! నీ వందో పుట్టిన ఏడు కానుకగానన్నా నీ/మా కోరికనెరవేరాలని.. తెలంగాణ రాష్ట్రం కావాలని..
ఇవాళటి పరిస్థితులను ఆనాడే ఊహించి కాళోజి రాసాడు చూసారా...
వేరు తెలంగాణొద్దని
పత్రికల్లో జోరుదారు
ప్రకటనలు చేస్తున్నారు
తతంగాలు - కుతంత్రాలు
అందరిదొకటే ఘోషణ
ఓపలేని కోస్తాంధ్రులు
కేంద్రం చేసెడి సూచన
కొప్పుకోరు ఒప్పుకోరు.
కాళోజి ముందు చూపంటారా? ఇప్పటికీ మారని అక్కడోళ్ల కరడుగట్టిన భావజాలమంటారా?

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్, బొత్సల సంగతినీ ఆనాడే గ్రహించి రాసాడు చూసారా..
ఎవరనుకున్నారు? ఇట్లౌనని ఎవరనుకున్నారు?
ముఖ్య మంత్రియే స్వయముగ సఖ్యత ఛేదిస్తాడని
ప్రాంతీయాధ్యక్షుండు పక్క తాళమేస్తాడని                //ఎవరను//
అధిష్టానానికి కట్టుబడి ఉంటానని పదేపదే చెప్పి, ఇప్పుడు ఒక ప్రాంతపు సీయంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రిగా ఉంటూనే హైదరాబాదులో సమైక్యసభకు మద్దతు తెలిపి సఖ్యత దెబ్బ తీయాలన్న వ్యూహమూ పన్నారు.

చిరంజీవినీ, అతని యూటీ ప్రతిపాదనను,   కాదుకాదని మళ్లీ చేసిన సమైక్యవాదాన్ని గురించి కాళోజికి తెలుసు...
బాధ్యతగల మంత్రి కూడ - బాతాలేకొడతాడని          //ఎవరను//

2 comments:

Anonymous said...

Yes...kaloji remains a great poet always....please do not add or imbibe or try to impress upon people with your versions being interpreted as ksloji s....the comments and the verses you quoted pertsins to 1969 movement and they were told in a different context
I am happy and feel proud to have heard him when he said these verses in andhra saraswatha parishat on a beautiful evening

Please do not misguide people with your.....MIDIMIDI GNANAM...like ka cha ra who damaaged the image of telangana

రాకుమార said...

sir! Thank U for U'r suggestion. but here I am not misguiding any one. Just I am comparing the situations of now & then. Sorry if U miss understand me as senior citizen.