24.10.10

చక్రంచెట్టు


@@@@@@@@@@@                                         
పొద్దున్నే 
పేస్టు పళ్లను
వెవ్వెవ్వే..... అంటూ
వేవేల పచ్చని నోళ్లు
       *  *  *
ఆవురావురు నోళ్ల
ఆకళ్లు తీర్చాలని
సూర్యుడిని వెలిగించే పనిలో
పూజ్వాలలు
       *  *  *
ఏడు దాటితే
అంతే.. అనితెలిసినా
ఆకులెంత పచ్చగా
ఒరేయ్!.. పూలను చూడరా

1 comment:

karlapalem Hanumantha Rao said...

ఏడు దాటితే
అంతే.. అనితెలిసినా
ఆకులెంత పచ్చగా
ఒరేయ్!.. పూలను చూడరా
Hats...off!