వేలు పట్టుకుని
పట్టణం
అడవి తోవ పట్టింది
* * *
రోజూ పాత బట్టలతో
బడాయిపోయే చెరూగట్టు
కొత్తబట్టల దారి ముందు
చిన్నబోయింది
* * *
జమ్మి చెట్టుపై
అస్త్రాలున్నాయి
ధరించగలిగే
"నరులే" లేరు
* * *
జమ్మాకు
బంగారమైందేం
ఈ పండుగ
పరుసవేది మరి
* * *
ఆకులు మార్చుకుని
అలాయ్ బలాయీలు
జీవితం
పచ్చగా ఉండాలని
* * *
ఇంకెక్కడుంటాయి
పాలపిట్టలు
ఉన్నాయిగా
జేబు పిట్టలు
* * *
సామూహిక
మానవ స్పర్షకు
అడవి తోవ
కలవరపడింది
* * *
* * *
2 comments:
Dasara naanees are so nice.
సామూహిక
మానవ స్పర్షకు
అడవి తోవ
కలవరపడింది
...మీది అచ్చమయిన కవిత్వం ! ఈ బ్లాగ్ రూపా కల్పనలోనే మీ అభిరుచి తెలిసిపోతుంది !
Post a Comment