4.4.11

'తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేదీ... "ఖర*"నే" అన్న వాక్యంలోని శ్లేష తెలిసిందనుకుంటా.

అందరికీ.... "ఖర" గాది శుభాకాంక్షలు....

   
---- ఖర అంటే పదునైన, తీక్షణమైన అనేఅర్థాలున్నాయి. ఖరకరుడు అన్న అర్థంలో సూర్యుణ్ణి పదునైన కిరణాలుగలవాడుగా చెప్పుకుంటాం. ఆ లెఖ్ఖన ఇక్కడ ఖర నామం పదుననే.
    ---- ఖరమంటే గాడిద అన్న అర్థమూ ఉంది. దేవుడు కాదు దేవుడి తండ్రి గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటే, గాడిద "గాడు" కంటే ఎక్కువనే. అందుకే ఇంగ్లీషువాడు "గాడ్ ద గుడ్" అంటే మనం "గాడిద గుడ్డూ" అని గాడిదను దేవుని పక్కన కూర్చోపెట్టాం. అంతే కాదండీ.....! గాడిద చాకిరి అన్న జాతీయాన్ని బట్టీ గాడిద ఎంత పని చేస్తుందీ తెలుస్తూనే ఉంది. ఈ లెఖ్ఖన ఇక్కడ ఖరనామం గాడిదకు రావడానికి కారణం  బాగా పనిచేయడం మూలాన్నే.
   ---- ఇక నేను పైన శీర్షికలో ఖరకు గ్రహించిన అసలైన అర్థం నా తెలంగాణాలోది. దాని అర్థం నిజం, నిశ్చయం అని. ఈ అర్థం లో ఖరారు అనే పదం అంతటా వాడుకలో ఉన్నదే. తెలంగాణాలో నిజం అనడానికి ఖర, ఖరాశిగా వాడూతాం.  ఎట్లానంటే "వారీ అది ఖరనేనంటవా", "ఖరాశిగ చెప్పు బిడ్డా.."
   *దీన్ని బట్టి 'తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేదీ... "ఖర*"నే" అన్న వాక్యంలోని శ్లేష తెలిసిందనుకుంటా.
 మొత్తం మీద ఖరకు ఉన్న అర్థం ఒక్కటే. అది పదును, తీక్షణం, తీవ్రత, నిశ్చయం. ఇవన్నీ ఛాయా భేదం ఉన్న దగ్గరి పదాలే.      

No comments: